కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రదీప్ చిలుకూరి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఈ సినిమా కోసం ముందు అనుకుంది మామూలు మాస్ కథ. అయితే, రాస్తున్న క్రమంలో ఓ పవర్‌ఫుల్ మదర్ కూడా ఉంటే బావుంటుందనిపిం చింది. ఆ మదర్ కూడా కర్తవ్యం లో వైజయంతి లాంటి శక్తిమంతమైన పాత్ర అయితే ఇంకా బావుంటుందనిపించింది. ముందు కల్యాణ్‌రామ్‌కి కథ చెప్పాం. ఆయన చేద్దాం అన్నారు. కానీ విజయశాంతిగారు తల్లి పాత్రకు ఒప్పకుంటేనే చేద్దాం అని క్లియర్‌గా చెప్పారు. విజయశాంతిగారు ఈ కథ విని హ్యాపీగా ఫీలయ్యారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా సెట్స్ మీదకెళ్లింది. కథ రీత్యా ఇందులో హీరో పాత్ర, మదర్ పాత్ర రెండూ ఎవరి ఐడియాలజీలో వాళ్లు కరెక్ట్‌గా ఉంటారు.

అక్కడ్నుంచే కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. రెండు పాత్రలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తల్లి కోసం కొడుకు చేసే త్యాగమే ఈ సినిమాకు హైలైట్. తెరపై భావోద్వేగానికి లోనుచేసే అంశమది. ఇందులోని పాత్రలన్నీ కథలో భాగమే. సాంకేతికంగా అభినందనీయంగా సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా చూసి సంతృప్తిగా ఫీలయ్యారు. కల్యాణ్‌రామ్ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని ప్రదీప్ తెలిపారు.
