కంచర్ల ఉపేంద్రబాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం కంచర్ల. యాద్ కుమార్ దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ని అరకులో గల మడగడ వ్యూ పాయింట్ వద్ద పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ మా ఇంటిపేరునే టైటిల్‌గా పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నాం. వచ్చే నెలలో సినిమా విడుదల చేస్తాం. వచ్చే లాభాలతో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం. కొత్తవారికి అవకాశాలిస్తూ మొత్తం ఎనిమిది సినిమాలు నిర్మిస్తున్నాం.

ఆగస్ట్15 తర్వాత సినిమాను విడుదల చేస్తాం. సాంకేతికంగా కూడా సినిమా మరోస్థాయిలో ఉంటుంది అని తెలిపారు. అద్భుతమైన కథతో, తమ ఇంటిపేరుతో తెరకెక్కతున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుం దని హీరో ఉపేంద్రబాబు నమ్మకం వ్యక్తంచేశారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ మీనాక్షి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ మధురవాడలో నిర్వహిస్తామని దర్శకుడు తెలిపారు.
