
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం మిత్రమండలి. నిహారిక ఎన్.ఎం కథానాయిక. విజయేందర్ ఎస్. దర్శకత్వంలో కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు, బీవీ వర్క్స్‌తో కలసి సమర్పిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ మిత్రమండలి టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బన్నీ వాసు సమర్పిస్తున్న తొలి చిత్రం ఇది. టీజర్ చాలా బావుంది. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి అని ఆకాంక్షించారు. బన్నీ వాసు మాట్లాడుతూ వినోదాత్మకంగా, ఉల్లాసంగా సాగే నలుగురు స్నేహితుల కథ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి అన్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌తో వస్తున్నాం అని విజయేందర్ ఎస్. అన్నారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు.
