చైతన్య రావ్, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎ జర్నీ టు కాశీ. ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకంపై దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముని కృష్ణ దర్శకుడు. హైదరాబాద్‌లో విడుదలకి ముందుస్తు వేడుకని నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శకుడు శేఖర్ హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ కాశీ యాత్రకు సంబంధించిన కథ ఇది. ఒక కుటుంబం కాశీకి చేసే యాత్రను నేపథ్యంగా ఎంచుకున్నాం. వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలు ఉంటాయి. ఈ చిత్రం కాశీ విశిష్టతను ప్రతిబింబిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్, కథానాయిక కేటలిన్ గౌడ, గాయని గోమతి అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఈ నెల 6న విడుదలకు సిద్ధమవుతున్నది.
