
నవీన్‌చంద్ర, షాలిని వడ్నికట్టి జంటగా నటిస్తున్న చిత్రం 28 డిగ్రీస్ సెల్సియస్. డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. వీరాంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదొక అందమైన ప్రేమకథా చిత్రమని, కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఈ కథలో ఉష్ణోగ్రత అనే అంశం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెలిపారు. ఈ సినిమాలో కథానాయికను 28 డిగ్రీల సెల్సియస్‌లోనే ఉంచాలని, అలా లేనిపక్షంలో ఆమెకు ఎలాంటి సమస్యలొస్తాయన్నది కథలో ఆసక్తికరంగా ఉంటుందని నవీన్‌చంద్ర పేర్కొన్నారు. థియేటర్‌లో చూసి ఫీల్ కావాల్సిన చిత్రమిదని, తప్పకుండా అందరికి నచ్చుతుందని నిర్మాత సాయి అభిషేక్ తెలిపారు. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్నందిస్తున్నారు. ఏప్రిల్ 4న విడుదల కానుంది.
