Skip to main content

Namaste NRI

ఆత్మసంతృప్తినిచ్చిన సినిమా ఇది

వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటిస్తున్న చిత్రం సౌండ్‌ పార్టీ. సంజయ్‌ శేరి దర్శకుడు. ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నిర్మాతలూ విలేకరులతో మాట్లాడారు. మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో వ్యాపారం చేస్తూ స్నేహితులమయ్యాం. సినిమాలంటే ఇష్టంతో నిర్మాతలుగా మారాం. కలిసి ఈ సినిమా నిర్మించాం. దాదాపు పాతిక కథలు విన్న తర్వాత ఈ కథను ఎన్నుకున్నాం. ఎక్కడి ప్రేక్షకులైనా ఇష్టపడేది హాస్యాన్నే. సంజయ్‌ శేరి చెప్పిన కథలో సున్నితమైన హాస్యం ఉంది. ఇక్కడ వంద థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అమెరికాలో 150కి పైన థియేటర్లలో విడుదల చేయనున్నాం అని అన్నారు. హాఫ్‌ నాలెడ్జ్‌ తండ్రీకొడుకులు మనీ మేకింగ్‌ ఎలా చేస్తారు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ని తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. బిట్‌ కాయిన కాన్సెప్ట్‌తోనూ దీంట్లో ఫన్‌ జనరేట్‌ చేశాం. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. కంప్లీట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తాం అని నిర్మాతలు చెప్పారు. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News