Namaste NRI

సంస్కారవంతమైన సినిమా ఇది 

సొహైల్, మృణాళిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకాలపై కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో  పాటు అందరినీ అలరించే చిత్రాలతో విజయవిహారం చేసిన ఎస్.వి.కృష్టారెడ్డిగారు, నేను, అచ్చిరెడ్డిగారు మళ్లీ ఇంతకాలం తర్వాత కల్పన గారి నిర్మాణంలో కల్పనచిత్ర పతాకంపై ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు తో మరో విజయ విహారానికి సిద్ధం అవుతున్నాము. ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేము, ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతంమైన కేటగిరీ సినిమాగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అన్నారు. 

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ చాలా విరామం తర్వాత నేను రూపొందించిన పూర్తి వినోదాత్మక సినిమా ఇది. డైలాగ్స్ బాగుంటాయి. నా కెరీర్ ప్రారంభం నుంచీ ప్రోత్సహిస్తున్నారు అచ్చిరెడ్డి. ఓ మంచి సినిమా చేస్తున్నామనే నమ్మకంతో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఉత్సాహంగా పనిచేశారు. రేపు థియేటర్లో ప్రేక్షకులు నవ్వే నవ్వులు చూడాలని వేచి ఉన్నాము అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ మార్చిలో విడుదల చేసేందుకు నిర్మాత కల్పన సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారి తరహా వినోదం, సందేశం ఈ సినిమాలో చూస్తారు అన్నారు.  నటి మీనా మాట్లాడుతూ నేను ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించాలని చాలా సార్లు అనుకున్నా ఎందుకనో కుదరలేదు. ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది  అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ ఎస్వీ కృష్ణారెడ్డి గారి వింటేజ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చూస్తాం. ఇంతమంది సీనియర్స్తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News