
హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్నది. ఆదినారాయణ పినిశెట్టి దర్శకుడు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. సినిమా చిత్రీకరణ దశలో ఉంది. రీసెంట్‌గా మూడో షెడ్యూల్ మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ఇది ఓ వైవిధ్యమైన ప్రేమకథ. అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా కథ, కథనాలు ఉంటాయి అన్నారు. కొత్త జానర్‌లో సినిమా ఉంటుందని, అందమైన లొకేషన్స్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని నిర్మాత చెప్పారు.
