Namaste NRI

వాళ్లందరికీ ధైర్యాన్నిచ్చే చిత్రమిది : రామ్‌చక్రి

సముద్రఖని, గౌతమ్‌ మీనన్‌, లక్ష్మీప్రియా, అభినయ తదితరులు ప్రధాన పాత్రల్లో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా కార్మేని సెల్వం. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌చక్రి విలేకరులతో మాట్లాడారు. అప్పుల సమస్యతో బాధపడుతున్న మధ్యతరగతి కుటుంబం వారికి కార్మేని సెల్వం ఒక ధైర్యాన్నిస్తుందని అన్నారు. మధ్యతరగతి జీవితాలకు దర్పణంలా ఈ సినిమా ఉంటుందని, అప్పుల కారణంగా వారు ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంలోని సంబంధాలు ఎలా ప్రభావితం అవుతున్నాయనే అంశాల్ని హృద్యంగా చూపించామని చెప్పారు. ప్రతీ సన్నివేశం సహజంగా ఉంటుందని, మధ్యతరగతి తండ్రిగా, భర్తగా సముద్రఖని నటన హృదయాల్ని కదిలిస్తుందని అన్నారు. ప్రతీ మిడిల్‌ క్లాస్‌కు ఈ సినిమా కనెక్ట్‌ అవుతుందని, విదేశాల్లో ఉండేవారు కనీసం ఏడాదికి ఒకసారైనా స్వదేశంలో వారి బంధువుల్ని కలవాలనే ఓ సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నామని దర్శకుడు రామ్‌చక్రి తెలిపారు. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.


Social Share Spread Message

Latest News