సీనియర్ హీరో నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శుభకృత్ నామ సంవత్సరం. ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం. డీఆర్ విశ్వనాథ్ నాయక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అతిథులుగా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు, పవిత్ర లోకేష్, దర్శకులు రామ్ అబ్బరాజు, నిర్మాత రాజేష్ దండా, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గ్లింప్స్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. నరేష్ మాట్లాడుతూ క్యారెక్టర్ నటుడిగా ముందుకెళ్తున్న నాకు లీడ్‌రోల్స్ కూడా మొదలయ్యాయి. అయితే, నేను ప్రతీది క్యారెక్టర్ గానే చూస్తాను. శుభకృత్ నామసంవత్సరం కథ నాకు బాగా నచ్చింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. టైటిల్ వినగానే అంతా పాజిటివ్‌గా స్పందించారు. ఇది డ్రామా, సస్పెన్స్, ట్రావెల్ అన్ని అద్భుతంగా ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉన్న సినిమా.తెలుగు, కన్నడ ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది అన్నారు.

నరేష్ చేస్తున్న ప్రతి రోల్ చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ఇస్తున్నారు. కొత్త డైరెక్టర్స్‌ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన సినిమాలో ఉంటే చాలు అనే ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు పరిశ్రమంలో ఉండడం చాలా గర్విస్తున్నాను అని హీరో శ్రీ విష్ణు చెప్పారు. పవిత్ర లోకేష్, డైరెక్టర్ రామ్ అబ్బరాజు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నిర్మాత రాజేష్ దండా తదితరులు ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.





























