Namaste NRI

వినోదం.. దేశభక్తి సినిమా ఇది

నిఖిల్  కథానాయకుడిగా నటించిన  చిత్రం స్పై.  గ్యారీ బీ హెచ్‌ దర్శకుడు. రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత.ఈ  చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లో హయెస్ట్ ఓపెనింగ్స్‌తో (11.7 కోట్లు) నేషన్ వైడ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో  నిఖిల్‌ మాట్లాడుతూ మా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నది. నా కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ లభించాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తాను అన్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. వినోదం, దేశభక్తి అంశాలతో ఆకట్టుకుంటున్నది అన్నారు.

చరణ్ తేజ్ మాట్లాడుతూ  సినిమాలోని కామెడీ, యాక్షన్ సహా అన్నీ ఎలిమెంట్స్ చక్కగా వర్కవుట్ అయ్యాయి. సినిమాకు ఇంత బిగ్ ఓపెనింగ్స్ రావడం హ్యాపీగా ఉంది అని పేర్కొన్నారు. గ్యారీ బిహెచ్ మాట్లాడుతూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో ఆనందంగా ఉందని తెలిపారు. తన తొలి చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉందని ఐశ్వర్యమీనన్‌ పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events