హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నిర్మించిన అమెరికా కాన్సులేట్ నూతన భవనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వ్యాంలో ఇదో మైలురాయిగా అభివర్ణించారు. 34 కోట్ల డాలర్లతో అత్యాధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించాం. ఈ పెట్టుబడి భారత్‌తో అమెరికాకు ఉన్న బంధంలో భాగం. కొత్త యూఎస్ కాన్సులేట్ జనరల్ వద్ద అమెరికా జెండాను ఎగురవేశాం.. ఈ రోజు ఈ అద్భుతమైన సదుపాయం సాధ్యమయ్యేలా కృషి చేసిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో యూఎస్-భారత్ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆమె చెప్పారు. కొత్త కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్టు వెల్లడించారు. కాన్సులేట్ కార్యాలయం ఇప్పటివరకు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో కొనసాగింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-43.jpg)