Namaste NRI

అందరికీ నచ్చే సినిమా ఇది : అభయ్‌ నవీన్‌

అభయ్‌ నవీన్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్‌. ఫైర్‌ ప్లె ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రం  నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విశ్వక్‌సేన్‌, ప్రియదర్శి, తిరువీర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో  అభయ్‌ నవీన్‌ మాట్లాడుతూ  మాది సిద్ధిపేట. మా నాన్న మ్యాథ్స్‌ టీచర్‌. నాకు సినిమాలంటే పిచ్చి. ఇంట్లో వాళ్లకేమో ఇష్టంలేదు. చివరకు నా పిచ్చి అర్థంచేసుకొని వాళ్లే ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ప్రియదర్శి, తిరువీర్‌, తరుణ్‌భాస్కర్‌, జీవన్‌రెడ్డి, పవన్‌ సాదినేని నాకు మంచి స్నేహితులు. వారందరూ నా వెనుక ఉన్నారు కాబట్టే ఈ సినిమా తీయగలిగాను. విశ్వక్‌సేన్‌ది గోల్డెన్‌ హార్ట్‌. అడగ్గానే వచ్చారు. అందరికీ నచ్చే సినిమా ఇది. నా నిర్మాతలు నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. వారి నమ్మకాన్ని కచ్చితంగా ఈ సినిమా నిలబెడుతుంది  అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events