Namaste NRI

ఈతరం పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది :  బన్నీవాసు

ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఛావా. విక్కీకౌశల్‌, అక్షయ్‌ ఖన్నా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగులో గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్స్‌ ద్వారా మార్చి 7న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్స్‌ మీట్‌లో నిర్మాత  బన్నీవాసు మాట్లాడారు. విక్కీ కౌశల్‌ క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాను. నిజంగా ైక్లెమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి. ఒక చరిత్ర సినిమాగా తీయడం తేలిక కాదు. ఓ కొత్త చరిత్రను ఇంత గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చిన దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌గారికి థాంక్స్‌. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ లాంటి మహారాజులే. పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది అని అన్నారు.

ఛావా లో కీలక పాత్ర పోషించిన వినీత్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ  ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన గీతాఆర్ట్స్‌ వారికి థాంక్స్‌ చెప్పుకుంటున్నా. ఇందులోని నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిస్తున్నది. నాకు గాత్రదానం చేసిన ఫణివంశీకి కృతజ్ఞతలు  అని తెలిపారు. ఇంకా తెలుగు డైలాగ్‌ రైటర్‌ సామ్రాట్‌, డబ్బింగ్‌ డైరెక్టర్‌ రాఘవ, లిరిక్‌ రైటర్‌ శ్రీమణి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events