
నితిన్ హీరోగా రూపొందిన చిత్రం రాబిన్‌హుడ్. దర్శకుడు వెంకీ కుడుముల. శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా గురించి దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడారు. మా రాబిన్‌హుడ్ సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ైక్లెమాక్స్‌లో వచ్చే ఎమోషన్, ట్విస్ట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు సినిమా బాగా నచ్చింది. నితిన్ పర్‌ఫార్మెన్స్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ సినిమాకు హైలైట్స్. ఇక వార్నర్ క్యామియోకి అయితే అదిరిపోయే స్పందన వస్తున్నది. ఇది ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా అని అన్నారు. థియేటర్లలో అందరూ ఎంజాయ్ చేసే క్లీన్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇదని, ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయని నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ తెలిపారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.
