ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇఫ్ యు డేర్ ఉపశీర్షిక. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్ర ఆడియో వేడుక జరిగింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఈ సినిమాలో ఆటగదరా శివ అనే టైటిల్ సాంగ్‌ను రాశారు చంద్రబోస్. ఆటగదరా శివ అనే పదాలు తనికెళ్ల భరణి జీవితంలో ఎంత ప్రధానమై నవో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన అనుమతి తీసుకొని ఈ పాట చేశాం. కథానుగుణంగా మంచి పాట లు అందించే అవకాశం దక్కింది అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ఇదొక న్యూఏజ్ సినిమా. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది అన్నారు. కీర వాణి గారు 35 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. ఆయన ప్రతి సినిమాకు ఏదో వండర్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో పని చేస్తారు. ఆటగదరా శివ పాట సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏఐ సాంకేతికత ద్వారా పాట పాడించారు. ఇదొక ప్రయోగం. సినిమాలోని మొత్తం ఏడు పాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి అన్నారు. ఈ సినిమాలో ప్రేమకథతో పాటు సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకు లను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.