Namaste NRI

సౌదీలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ కార్యక్రమం

యన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా ఆధ్వర్యంలో జుబైల్ పారిశ్రామిక నగరంలో  నిర్వహించిన  ఇదేమి కర్మ కార్యక్రమానికి ప్రవాసాంధ్ర అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. ఉపాధ్యక్షుడు భరద్వాజ్, కోశాధికారి చంద్రశేఖర్, కోర్డినేటర్ శ్రీనివాస రావు, పార్టీ నాయకులు రామరాజు, సత్యనారాయాణ, వెంకటేశ్వరరావు, సిరపరపు సత్యనారాయణ, మరుపూడి శ్రీనివాస రావు, సుబ్రమణ్యం, పట్టాభిరామయ్య, వెంక శ్రీరామరాజు, ఆనంద్ పిల్లా, శివ కృష్ణ తదితరులు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన తెలియజేసారు. వివిధ పెట్రో రసాయానాల పరిశ్రమలు, నిర్మాణ సంస్థలలో పని చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ  చేపట్టిన ఇదేమి కర్మ అనే కార్యక్రమం ఇప్పుడు గల్ఫ్ దేశాలలో కూడా చురుగ్గా కొనసాగుతుంది.

Social Share Spread Message

Latest News