కువైత్‌లో ఎన్నారై టీడీపీ కార్యవర్గం-2 అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ్ణ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎన్నారై విభాగం సూచనలతో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అహ్మది గవర్నరేట్ కో-ఆర్డినేటర్ ఈదుపుగంటి దుర్గా ప్రసాద్, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ కో-ఆర్డినేటర్ పెంచల్ రెడ్డి, మైనార్టీ కన్వీనర్ చాన్ బాషా, ఎంపవర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు పాల్గొన్నారు.