తనీష్ అల్లాడి, శ్రీరామ్‌రెడ్డి ద్వారక వి, ప్రియాంక పాసల, దివ్య దిల్చోకర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం కేసీపీడీ. (కొంచెం చూసి ప్రేమించు డూడ్). గౌతమ్ మన్నవ దర్శకుడు. కార్తిక్ రెడ్డి, వరుణ్ దగ్గుబాటి నిర్మాతలు. తాజాగా వాలెంటైన్స్ డే ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ ఆకర్షణగా ఉండటమే కాకుండా, సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యువతరం మనస్తత్వం, ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది అన్నారు. ఈ సినిమా షూటింగ్‌ని మార్చి నెలలో మొదలుకొని సమ్మర్‌కి విడుదలకి సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రజెంట్ జనరేషన్లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నామని వారు తెలిపారు.














