ఆనంద్ రవి, మీనాక్షి జంటగా నటిస్తున్న సినిమా కొరమీను. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరి సమన్య రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీపతి కర్రి దర్శకుడు. ఈ నెల 31న విడుదల కానుంది. తాజాగా చిత్రంలో తెలిసిందే లే అనే పాటను విడుదల చేశారు. ఈ వేడుకకు దర్శకుడు వశిష్ఠ, గాయని సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ మీసాల రాజు కు మీసాలు ఎవరు తీశారనే కాన్సెప్ట్‌ను బాగా ప్రచారం చేశాం. ఇప్పటిదాకా సినిమాల్లో ఎన్నో రకాల మిస్టరీ కథలు వచ్చాయి కానీ మీసాలు ఎవరు తీశారనే కాన్సెప్ట్ తెరకెక్కించలేదు. పేద వాడికి గొప్ప వాడికి మధ్య జరిగే కథ ఇది. అన్నారు. విశాఖ నేపథ్యంలో సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ ఒక మంచి కథతో సినిమాను నిర్మిస్తున్నాం. హరీష్ ఉత్తమన్, శత్రు పాత్రలతో పాటు హీరోగా ఆనంద్ రవి, నాయికగా మీనాక్షి ఆకట్టుకుంటారు అని చెప్పింది. ఈ కార్యక్రమంలో సాయివర్మ, సమన్య, ఇమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు.