సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరోం హర. ది రివోల్ట్ ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ దర్శకత్వం. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతు న్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో జరిగే కథ ఇది. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సాగుతుంది. అన్యాయాలు, అక్రమాలతో కూడిన వ్యవస్థపై ఓ సామాన్యుడి తిరుగుబాటు ఏమిటన్నదే సినిమా కథ. సుధీర్‌బాబు పాత్ర చిత్ర ణ పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాత: సుమంత్ జి నాయుడు, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)