సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ విజయవాడ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇందులో సుహాస్ వృత్తిలో స్థిరపడే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే రచయితగా కనిపిస్తారు. ఆయన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది అని చెప్పారు. టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 3న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ శాకమూరి, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణ సంస్థలు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్.