Skip to main content

Namaste NRI

ఆమెరికాలో తీసిన పక్కా తెలుగు సినిమా ఇది :  హర్షివ్‌ కార్తిక్‌

హర్షివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బహుముఖం. గుడ్‌, బ్యాడ్‌ అండ్‌ ది యాక్టర్‌ ఉపశీర్షిక. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు శశి కిరణ్‌ తిక్క ఆవిష్కరించారు. హీరోలోని భిన్న కోణాల్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కౌన్సిలింగ్‌ సెషన్‌లో భాగంగా హీరో సైకో థెరపిస్ట్‌ దిశను కలవడం, తన కలను నెరవేర్చుకోవడానికి ఆమె సహాయాన్ని కోరడం, తన చుట్టూ వున్న వ్యక్తు ల తాలూకు కొన్ని సీక్రెట్స్‌ తనకు తెలుసునని చెప్పడం ఆసక్తిని పెంచింది.  హీరో, దర్శకుడు హర్షివ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ  ఆమెరికాలో తీసిన పక్కా తెలుగు సినిమా ఇది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఆనూహ్య మలుపులతో సాగు తుంది. చిరంజీవి స్ఫూర్తిగా సినీ రంగంలోకి వచ్చాను. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా అందరిని మెప్పి స్తుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ల్యూక్‌ ఫ్లెచర్‌, సంగీతం: ఫణి కల్యాణ్‌, రచన, నిర్మాణం, దర్శకత్వం: హర్షివ్‌ కార్తీక్‌.

Social Share Spread Message

Latest News