ఈ ఏడాది భారత్ నుంచి రికార్డు స్థాయిలో 55 వేల మందికి పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారనని ఢల్లీిలోని యూఎస్ ఎంబసీ తెలిపింది. 2021లో 55వేలకు పైగా విద్యార్థులు ఎక్ఛ్సేంజి విజిటర్ల వీసా దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లు తెలిపింది. ఇది ఆలటైం రికార్డని పేర్కొంది. వాస్తవానికి మే నెలలో వీసా దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. కానీ, కోవిడ్ కారణంగా ఆసల్యంగా మొదలైంది. పరిస్థితులు చక్కబడినట్లు కనిపించగానే వీసా సేవలను జులైలో పునరుద్ధరించాం. పనిభారం ఉన్నప్పటికీ అదనపు గంటల్లో పనిచేసి దరఖాస్తులను పరిశీలించి, రికార్డు స్థాయిలో ఆమోదించాం అని తెలిపింది.