వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్లాట్. భాను భవ తారక దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇదొక ప్రయోగాత్మక చిత్రమని, ప్రతీది వైవిధ్యంగా ఉందన్నారు. దర్శకనిర్మాత భాను భవ తారక మాట్లాడుతూ వేణు ఊడుగుల తీసిన నీదీ నాదీ ఒకే కథ నాలో ధైర్యాన్ని నింపింది. కరోనా టైంలో ఈ కథ రాసుకున్నా. ట్రైలర్ చూసిన వారు డిఫరెంట్ మూవీ అంటున్నారు. ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారు. ఇప్పటివరకు టచ్ చేయని కొత్త పాయింట్‌తో తెరకెక్కించాం. తెలుగులో ఇలాంటి జోనర్‌లో వస్తున్న తొలి చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రమణ్, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, నిర్మాణ సంస్థ: బి.బి.టి.ఫిల్మ్స్, నిర్మాతలు: కార్తీక్ సేపురు, భాను భవ తారక, తరుణ్ విఘ్నేశ్వర్.