సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి రామం రాఘవం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై పృథ్వీ పొలవరపు నిర్మిస్తున్నారు. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృథ్వీ, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని తదితరులు నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ను విడుద ల చేశారు. ఈ సినిమాలో సముద్రఖని, ధనరాజ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ధనరాజ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇప్పటివరకు రానటువంటి తండ్రీకొడుకుల కథ ఇది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దుర్గా ప్రసాద్, సంగీతం: అరుణ్ చిలువేరు, కథ: శివప్రసాద్ యానా, దర్శకత్వం: ధనరాజ్.