అదానీ గ్రూప్నకు సవాళ్లు ఎదురవడం ఇదే మొదటిసారి కాదని ఆ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన 51వ జెమ్ అండ్ జ్యుయెలరీ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అమెరికా చట్టాలకు అనుగుణంగా వ్యవహరించడం గురించి ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇటువంటి సవాళ్లు ఎదురవడం తమకు ఇదే మొదటిసారి కాదన్నారు. అదానీ గ్రూప్పై జరిగే ప్రతీ దాడి దానిని మరింత బలోపేతం చేస్తుందని, ప్రతి అడ్డంకి దాని ఎదుగుదలకు ఓ మెట్టుగా మారుతుందని చెప్పారు.