వచ్చే నెల భారత్ ఆతిథ్యమివ్వనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అంశం చర్చకు వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. ఇది తమ మిత్రులు, భాగస్వాముల చర్చల్లో తరచుగా వచ్చే అంశమని పేర్కొంది. అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మిత్రులు, భాగస్వాములతో జరుగుతున్న సంభాషణలన్నింటిలోనూ ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తూనే ఉంటాం. ఇది మా ప్రధానమైన అంశాల్లో ఒకటి. జీ`20లో కూడా ఇది ఉంటుంది అని తెలిపారు. అధ్యక్ష హోదాలో భారత్ సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఈ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా జీ`20 నేతలంతా ఈ సమావేశానికి రానున్నారు. చైనా, రష్యా అధ్యక్షులు కూడా పాల్గొననున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)