రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతిని నెలకొల్పడం భారత ప్రధాని మోదీతో సాధ్యమని మెక్సికో వ్యాఖ్యానించింది. ఉభయ దేశాల నడుమ శాంతి స్థాపనకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నించాలి. ఇందుకు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ చేసిన ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను. శాంతిని నెలకొల్పే దిశగా మధ్యవర్తిత్వం నిమిత్తం ఇతర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇందులో ప్రధాని మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్లను చేర్చాలని ప్రతిపాదిచారు అని ఐరాసలో జరిగిన చర్చ సందర్భంగా మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెల్ ఎబ్రార్డ్ వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)