Namaste NRI

నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి

హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో 2024కి గాను ఏఎన్నార్‌ జాతీయ పురస్కారాల వేడుకల కార్యక్రమం ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ని శాలువాతో సత్కరించి, అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేశారు అమితాబ్‌ బచ్చన్‌. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ఈ రోజు ది గ్రేట్‌ ఏఎన్నార్‌ అవార్డును ది గ్రేట్‌ అమితాబ్‌బచ్చన్‌గారి చేతుల మీదుగా అందుకున్నా. ఇప్పుడు నేను ఇంట గెలిచాను.. రచ్చగెలిచాను అనిపిస్తోంది. ఈ పురస్కార ప్రదానం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్‌ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందించాను. నాకు పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, గిన్నిస్‌బుక్‌లో స్థానం వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నావాళ్లు నన్ను గుర్తించి అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని అన్నారు.

ఈవెంట్‌లో అక్కినేని హీరోలతోపాటు చిరంజీవి తల్లి అంజనా దేవి, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాతలు అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, యాక్టర్లు వెంకటేశ్‌, నాని, రాంచరణ్‌, ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణితోపాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events