Namaste NRI

ఇది మా సంస్థ చేస్తున్నపెను సాహసం: నాగ్‌ అశ్విన్‌

నాగ్‌ అశ్విన్‌  దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్‌ వరల్డ్‌ మూవీ కల్కి2898 ఏడీ. ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొనే, దిషా పటానీ లాంటి టాప్‌ స్టార్స్‌ భాగమైన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా సినిమా కంటే ముందు యానిమేషన్‌ సిరీస్‌ని మేకర్స్‌ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బుజ్జి అండ్‌ భైరవ యానిమేషన్‌ సిరీస్‌ ట్రైలర్‌ను హైదరా బాద్‌లో లాంచ్‌ చేశారు.  దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ కల్కి యానిమేషన్‌ వరల్డ్‌ కోసం ఒక చిన్న ఎంట్రీగా మేం తయారు చేసిన గ్లింప్స్‌  ప్రపంచమంతా చూడబోతున్నది. గత నాలుగేళ్లుగా ఈ సినిమాకోసం పనిచేస్తున్నాం. సినిమాకంటే ముందే యానిమేషన్‌ సిరీస్‌ను విడుదల చేయడం మా సంస్థ చేస్తున్న పెను సాహసం అన్నారు.

 ఈ యానిమేషన్‌ సిరీస్‌ అనేది నిజంగా కొత్త ప్రయత్నం. చోటా భీమ్‌ తో పాటు ఎన్నో యానిమేషన్‌ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్‌ గోల్డ్‌ సంస్థతో కలిసి ఈ సిరీస్‌ను రూపొందించాం. ఈ కల్కి 2898ఏడీ నిర్మాణం వల్ల వైజయంతీ ఆటోమొబైల్స్‌, వైజయంతీ యానిమేషన్‌, వైజయంతీ మూవీస్‌, ఇలా మూడు డిఫరెంట్‌ కంపెనీలను నడిపించామని సగౌరవంగా తెలియజేస్తున్నా అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events