Skip to main content

Namaste NRI

ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ఫ్లస్ పాయింట్ : రిత్విక్‌

రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ టార్టాయిస్‌. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్‌, ధన్య బాలకృష్ణ కీలక పాత్రధారులు. రిత్విక్‌ కుమార్‌ దర్శకుడు. విజయ్‌ చౌదరి, శశిధర్‌ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. నీ పరిచయం అంటూ చంద్రబోస్‌ రాసిన ఈ పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాట సినిమాకు పిల్లర్‌ లాంటిదని, అనూప్‌ రూబెన్స్‌ సంగీతానికి చిన్మయి గానం తోడవ్వడంతో ఈ పాటకు నిండుదనం వచ్చిందని నిర్మాతలు తెలిపారు.

దర్శకుడు రిత్విక్‌ మాట్లాడుతూ ఫుల్‌ ఎైగ్జెట్‌మెంట్‌తో ఉన్న ఈ థ్రిల్లర్‌ సినిమాలో లవ్‌ ఎలిమెంట్‌ తీసుకొచ్చి కథను టర్న్‌ చేసే పాత్రను పోషించారు రాజ్‌ తరుణ్‌. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ఫ్లస్ పాయింట్. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అని చెప్పారు. ఇదొక యూనిక్‌ థ్రిల్లర్‌ అని, ఈ సినిమాలో మంచి మెలొడీ సందర్భం వచ్చినప్పుడు అనూప్‌ బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారని, ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతిని పంచే సినిమా ఇదని హీరో రాజ్‌తరుణ్‌ పేర్కొన్నారు. ఇంకా హీరోయిన్‌ అమృతా చౌదరి, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, అవసరాల శ్రీనివాస్‌, నటి ధన్య బాలకృష్ణ, సింగర్‌ చిన్మయి కూడా మాట్లాడారు. త్వరలో సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events