Namaste NRI

ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు ఇదే

ప్రపంచంలో మరెక్కడా లేని  భారీ ప్రాజెక్టుకు సౌదీ అరేబియా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ దేశ రాజధాని రియాద్‌లో 400 మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తుతో అత్యంత భారీ ఘనాకార నిర్మాణాన్ని చేపట్టనున్నది. దానికి ముకాబ్ అని నామకరణం కూడా చేసింది. ఆ భవనం కింది భాగంలో ఉండే పట్టణాన్ని న్యూ మురబ్బా అని పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రమోషనల్  సౌదీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ బిల్డింగ్‌లో  లక్ష ఇండ్లుంటాయి, వేల కొద్దీ హోటళ్లుంటాయి, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌  ఉంటాయి. ఆఫీసులు, మ్యూజియాలు, కమ్యూనిటీ అవుట్‌లెట్లుంటాయి. అంతేకాదు, చదువుకోవడానికి ఏకంగా ఒక యూనివర్సిటీనే ఉంటుంది. చతురస్రాకారంలో ఉండే ముకాబ్‌లో  20 ఎంపైర్ స్టేట్ బిల్డింగులను నిర్మించనున్నారు. దీన్ని 2030 నాటికి సిద్ధం చేస్తామని ఆ దేశ సర్కారు చెప్తున్నది. ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు  కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని, నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకొనేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో మార్స్‌పైకి  వెళ్లాలనిపిస్తే, ఇక్కడి నుంచే వెళ్లేలా ఏర్పాట్లు కూడా చేయనున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events