క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థ ఎఫ్‌టీఎక్స్ దివాళా కేసులో ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు శ్యామ్ బ్యాంక్మన్ ఫ్రెడ్‌కు 25 ఏండ్ల జైలుశిక్ష పడింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడంతోపాటు కస్టమర్ల మనీ తస్కరించి, క్రిప్టో ఫ్రాడ్ కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అతడి ముగ్గురు స్నేహితులు కూడా నేరం చేసినట్లు తేలిం ది. 2022 డిసెంబర్లో బహమస్ లో అరెస్ట్ అయిన శ్యామ్ బ్యాంక్మన్ ఫ్రెడ్ ఇన్వెస్టర్లు, కస్టమర్లకు చెందిన సొమ్ము సుమారు 800 కోట్ల డాలర్లు మోసం చేశాడని గతేడాది నవంబర్ లో తేలింది. అమెరికా చరిత్ర లోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా ఇది నిలిచింది. బ్యాంక్ మన్ ఫ్రైడ్ అరెస్టయిన తర్వాత అమెరికా స్టాక్ మార్కె ట్లు భారీగా పతనం అయ్యాయి. ఒకానొక దశలో ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజీల్లో ఎఫ్‌టీఎక్స్ రెండోవది.
అమెరికాలోని మ్యాన్ హట్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు శ్యామ్ బ్యాంక్ మన్ ఫ్రైడ్‌కు చెందిన 11 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది. శ్యామ్ బ్యాంక్ మన్ ఫ్రైడ్ భవిష్యత్ లో ఎటువంటి తప్పులు చేయకుండా 25 ఏండ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు అతడికి 100 ఏండ్ల జైలుశిక్ష పడాల్సి ఉన్నా, 40 ఏండ్లకు పరిమితం చేయాలని కోరారు. చివరకు న్యాయమూర్తి లూయిస్ ఏ కాప్లాన్, శిక్షను 25 ఏండ్లకు పరిమి తం చేశారు. ఇది చూడటానికి దీర్ఘకాల శిక్షగా కనిపిస్తున్నా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధించాల్సిన శిక్షతో పోలిస్తే తక్కువేనన్నారు.