Namaste NRI

నా కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఇది : వంశీ

రవితేజ కథానాయకుడిగా రూపొందిన చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు.నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణూదేశాయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మాట్లాడుతూ నాగేశ్వరరావు టైగర్‌గా ఎలా మారాడు అనేది ఇందులో ఆసక్తికరమైన విషయం. నాగేశ్వరరావు చూడ్డానికి క్రూరంగా ఉంటాడు. కానీ లోపలుండే సోల్‌ వేరే. అదేంటో చూపించడానికి ప్రయత్నించాం. ఇది ఒక దొంగ కథే కావొచ్చు. కానీ అతని పాత్రలో ఊహించని ఉద్వేగాలున్నాయి. నాగేశ్వరరావు గురించి ఎన్నో కథలున్నాయి. కానీ వాటికి సాక్ష్యాల్లేవు. అందుకే బేస్డ్‌ అన్‌ ట్రూ రూమర్స్‌ అని కార్డ్‌ వేశాం. నా కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుంది అని అన్నారు.   నిజానికి బయోపిక్‌ చేయడం చాలా కష్టం. తెలిసిన విషయాన్ని ఆసక్తిగా చెప్పాలి. ఏమాత్రం అటుఇటూ అయినా తేడా కొడుతుంది. అందుకే జాగ్రత్తగా తీశాం. చూస్తున్న ప్రేక్షకుడికి ఓ అద్భుతాన్ని చూస్తున్న అనుభూతినిస్తుందీ సినిమా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని నమ్మకంగా చెపుతున్నాను అన్నారు.

Social Share Spread Message

Latest News