Namaste NRI

 తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో 55 మందికి చోటు కల్పించింది. అయితే ప్రకటించిన జాబితాలో 55 మందికి మాత్రమే చోటు దక్కింది. గెలుపు అవకాశాలను ఉన్న అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సర్వే ఫలితాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఖరారు చేశారు.

1. బెల్లంపల్లి నుంచి- గడ్డం వినోద్, 2. మంచిర్యాల -నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, 3. నిర్మల్ నుంచి -కూచాడి శ్రీహరి రావు, 4. ఆర్మూర్- నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, 5. బోధన్ నుంచి -పి. సుదర్శన్ రెడ్డి, 6. బాల్కొండ- నుంచి సునీల్ కుమార్ ముత్యాల, 7. జగిత్యాల నుంచి -టి. జీవన్ రెడ్డి, 8. ధర్మపురి నుంచి- అడ్లూరి లక్ష్మణ్ కుమార్, 9. రామగుండం నుంచి ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, 10. మంథని- నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, 11. పెద్దపల్లి- నుంచి చింతకుంట విజయ రమణారావు, 12. వేములవాడ- నుంచి ఆది శ్రీనివాస్, 13. మానకొండూర్ -నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 14. మెదక్- నుంచి మైనంపల్లి రోహిత్ రావు, 15. ఆంథోల్ -నుంచి సి. దామోదర రాజనర్సింహ, 16. జహీరాబాద్ నుంచి- ఆగం చంద్ర శేఖర్, 17. సంగారెడ్డి- నుంచి తురుపు జగ్గారెడ్డి, 18. గజ్వేల్- నుంచి తూంకుంట నర్సా రెడ్డి, 19. మేడ్చల్- నుంచి తోటకూరు వజ్రేష్ యాదవ్, 20. మల్కాజిగిరి- నుంచి మైనపల్లి హనుమంత రావు, 21. కుత్బుల్లాపూర్- నుంచి కొలన్ హన్మంత్ రెడ్డి, 22. ఉప్పల్- నుంచి ఎం. పరమేశ్వర్ రెడ్డి, 23. చేవెళ్ల నుంచి- పామెన భీం భారత్, 24. పరిగి నుంచి టి.రామ్మోహన్ రెడ్డి, 25. వికారాబాద్ నుంచి- గడ్డం ప్రసాద్ కుమార్, 26. ముషీరాబాద్- నుంచి అంజన్ కుమార్ యాదవ్, 27. మలక్‌పేట నుంచి- షేక్ అక్బర్, 28. సనత్‌నగర్- నుంచి డా. కోట నీలం, 29. నాంపల్లి- నుంచి మహ్మద్ ఫిరోజ్ ఖాన్, 30. కార్వాన్ నుంచి ఒస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజ్రీ, 31. గోషామహల్ నుంచి- మొగిలి సునీత, 32. చాంద్రాయణగుట్ట – నుంచి బోయ నగేష్ (నరేష్), 33. యాకుత్‌పురా- నుంచి కె.రవి రాజు, 34. బహదూర్ పురా నుంచి -రాజేష్ కుమార్, పులిపాటి, 35. సికింద్రాబాద్- నుంచి ఆడమ్ సంతోష్ కుమార్, 36. కొడంగల్- నుంచి అనుముల రేవంత్ రెడ్డి, 37. గద్వాల్ -నుంచి సరితా తిరుపతయ్య, 38. అలంపూర్ – నుంచి ఎస్‌ఏ సంపత్ కుమార్, 39. నాగర్ కర్నూల్ – నుంచి డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి, 40. అచ్చంపేట నుంచి- డాక్టర్ సికుడు వంశీకృష్ణ,
41. కల్వకుర్తి – నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, 42. షాద్‌నగర్- నుంచి కె. శంకరయ్య, 43. కొల్లాపూర్ -నుంచి జూపల్లి కృష్ణారావు, 44. నాగార్జున సాగర్- నుంచి జయవీర్ కుందూరు, 45. హుజూర్‌నగర్- నుంచి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, 46. కోదాడ – నుంచి నలమాడ పద్మావతి రెడ్డి, 47. నల్గొండ- నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, 48. నకిరేకల్ – నుంచి వేముల వీరేశం, 49. ఆలేరు నుంచి- బిర్లా ఐలయ్య, 50. ఘన్‌పూర్ (స్టేషన్) నుంచి- సింగపూర్ ఇందిర, 51. నర్సంపేట- నుంచి దొంతి మాధవ రెడ్డి, 52. భూపాలపల్లె- నుంచి గండ్ర సత్యనారాయణరావు, 53. ములుగు నుంచి సీతక్క, 54. మధిర – నుంచి భట్టి విక్రమార్క మల్లు, 55. భద్రాచలం- నుంచి పొడెం వీరయ్యలు పోటీ చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events