చైనాలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చారు. ఆ మూత్రపిండం 13 రోజుల నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నది. గతంలో ఇలాంటి అవయవ మార్పిడు లు అమెరికాలో జరిగినప్పటికీ చైనాలో ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి. కొద్ది వారాల క్రితం చైనాలో ఓ వ్య క్తికి పంది కాలేయాన్ని విజయవంతంగా అమర్చిన వైద్యుల బృందం, బ్రెయిన్-డెడ్ పేషెంట్‌కు గత నెల 25న పంది కిడ్నీని అమర్చింది. ఆ పేషెంట్ దేహంలో పంది మూత్రపిండం చక్కగా పనిచేస్తున్నదని, సాధారణ స్థాయిలోనే మూత్రాన్ని ఉత్పత్తి చేస్తున్నదని వైద్యులు వెల్లడించారు.