ప్రధానమంత్రి నరేంద్ర మోఈ చొరవతో రష్యా, ఉక్రెయిన్ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లఖ్‌నపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 వేల మంది విద్యార్థులను కాపాడటానికి ఇరు దేశాల అధినేతలతో మోదీ మాట్లాడారని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధాన్ని మూడో దేశం కారణంగా ఆపడం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు.