అగ్రరాజ్యం అమెరికాలోని టెన్నస్సీ భారీ వర్షం ధాటికి అతలాకుతలమవుతోంది. వరదల్లో వందలాది కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో మనుషులు గల్లంతయ్యారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మృతి చెందినట్లు తెలిసింది. టెన్నిస్సీలోని హంప్రీ కౌంటీలో 24 గంటల్లో 43 సెంటీమీటర్ల వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వందేళ్లలో అమెరికా చూసిన అత్యంత భారీ వర్షం ఇదే అంటున్నారు అధికారులు.