Namaste NRI

ఇలాంటి పాత్రని చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి :  నితిన్‌

నితిన్‌ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన చిత్రం రాబిన్‌హుడ్‌.  ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ  ఈ సినిమాలో నేను బిగ్‌ మానిప్యులేటర్‌గా కనిపిస్తా. బుద్ధిబలాన్ని బాగా నమ్ముతాను. నా కెరీర్‌లో తొలిసారి ఈ తరహా పాత్ర చేశా. ఈ కథలోని మలుపులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఓ హార్ట్‌టచింగ్‌ పాయింట్‌ ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ సమపాళ్లలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతిథి పాత్ర తాలూకు సన్నివేశాలను ఆస్ట్రేలియాలో షూట్‌ చేశామని, ఆ ఎపిసోడ్‌ ఇంట్రెస్టింగ్‌ ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కోసం కొన్ని సెంటర్లలో మాత్రమే ఐదు శాతం టికెట్‌ రేట్లను పెంచామని, ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నామని నిర్మాత వై.రవిశంకర్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]