మెక్సీకో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారిగా మహిళ నియమితులయ్యారు. జస్టిస్ నార్మ లుసియా పినా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారం సందర్భంగా జస్టిస్ నార్మ ఆమె మాట్లాడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రను కాపాడతానని అన్నారు. అంతేకాదు ఏ విషయంలోనైనా మెజారిటీ సాధించడమే తన ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ పదవి కోసం ఆమెతో పాటు మరో న్యాయమూర్తి పోటీపడ్డారు. దాంతో ఓటింగ్ నిర్వహించారు. జస్టిస్ నార్మ 6-5 మెజారీటీతో జస్టిస్ యాస్మిన్ ఎస్క్వివెల్‌పై విజయం సాధించారు.
జస్టిస్ యాస్మిన్ పేరును దేశాధ్యక్షుడు అండ్రెస్ మాన్యుఎల్ లొపెజ్ ఒబ్రడార్ ప్రతిపాదించారు. అయితే, జస్టిస్ యాస్మిన్‌పై డిగ్రీ సర్టిఫికెట్ కోసం నకిలీ పేపర్ సమర్పించింది అనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఓటింగ్ ఆమెకు ఆనుకూలంగా రాలేదు. దేశ సుప్రీంకోర్టు చరిత్రలో తొలి మమిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ నార్మను ప్రతిపక్షాలు అభినందించాయి.ఈ పదవిలో ఆమె నాలుగేళ్లు కొనసాగనున్నారు. మెక్సికో ప్రధాన ధర్మాసనంలో మొత్తం 11మంది సభ్యులు ఉన్నారు.