Namaste NRI

సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి… ఒకేసారి 9 మంది

సుప్రీంకోర్టులో అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకేరోజు మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. 9 మందిని సుప్రీంకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో 9 మంది జడ్జీలుగా ప్రమాణ చేయడం ఇదే తొలిసారి. సీజేఐ ఎన్‌వీ రమణ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా ప్రభావం కారణంగా ఈసారి ప్రమాణ స్వీకార వేదికను మార్చారు. 1వ కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, అదనపు భవనం ఆడిటోరియానికి మార్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఎక్కువ స్థలం కోసం అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 9 మంది ప్రమాణ స్వీకారం చేయగా ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బేలా త్రివేది సహా.. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జె.కె. మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. జడ్జిల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events