Namaste NRI

ప్రపంచంలో ఇదే తొలిసారి… చైనాలో

 తన బ్యాటరీలను తానే మార్చుకొనే హ్యూమనాయిడ్‌ రోబోలను చైనా ఆవిష్కరించింది. ఇలాంటి రోబోల ఆవిష్కరణ ప్రపంచంలో ఇదే తొలిసారి. వాకర్‌ ఎస్‌2గా పిలిచే ఈ రోబోల పనితీరును వివరించే వీడియోను వాటి తయారీ సంస్థ యూబీటెక్‌ రోబోటిక్స్‌ విడుదల చేసింది. అందులో ఓ రోబో చార్జింగ్‌ స్టేషన్‌కు వెళ్లి తన ఛాతీ నుంచి క్షీణించిన బ్యాటరీలను తొలగించి వాటిని చార్జింగ్‌ డాక్‌లో ఉంచింది.

ఆ తర్వాత తాజా బ్యాటరీలను అమర్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజా ఆవిష్కరణ ప్రకారం మనుషుల సాయం లేకుండా, నిరంతరాయంగా కనీసం 24 గంటలపాటు రోబోలు పనిచేయగలవని యూబీటెక్‌ రోబోటిక్స్‌ తెలిపింది. చైనా ప్రభుత్వం కొన్నేండ్లుగా రోబోటిక్స్‌ను, కృత్రిమ మేధను ప్రోత్సహిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events