Skip to main content

Namaste NRI

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!

ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల శక్తిని అంచనా వేసే పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ స్థానం పడిపోయింది. ఈ తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్ లో భారత పాస్‌పోర్ట్ 73వ స్థానంలో నిలిచింది. 2025లో 66వ స్థానంలో ఉన్న భారత్, ఈ ఏడాది ఏకంగా ఏడు స్థానాలు దిగజారింది. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆఫ్ఘ‌నిస్థాన్ పాస్‌పోర్ట్ అత్యంత బలహీనమైనదిగా జాబితాలో చిట్టచివరన నిలిచింది.

ఆర్టన్ క్యాపిటల్ సంస్థ ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను రూపొందిస్తున్న‌ది. వీసా లేకుండా (వీసా-ఫ్రీ), వీసా ఆన్ అరైవల్ సౌకర్యాలున్న దేశాల సంఖ్య ఆధారంగా మొబిలిటీ స్కోర్ (ఎంఎస్‌) కేటాయిస్తారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ పాస్‌పోర్ట్ అంత శక్తిమంతమైనదని అర్థం. మొత్తం 199 దేశాల పాస్‌పోర్ట్‌లను ఈ ర్యాంకింగ్ కోసం విశ్లేషించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events