హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవలే పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపాయికి జన్మ నిచ్చింది. ఈ చిన్నారికి క్లీంకార కొణిదెల అని పేరు పెట్టినట్లు అగ్ర నటుడు చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. లలిత సహస్ర నామం నుంచి ఈ పేరును తీసుకున్నాం. క్లీంకార అంటే ఆధ్మాతిక చైతన్యానికి, ప్రకృతి స్వరూపానికి, పవిత్రమైన శక్తికి ప్రతీక. జీవితంలో ఎదిగే కొద్ది ఈ లక్షణాలన్నింటిని మా యువరాణి తన వ్యక్తిత్వంలో కనబరుస్తుందని కోరుకుంటున్నా అని చిరంజీవి పేర్కొన్నారు. చక్కటి ఆధ్యాత్మిక, దైవిక భావాలు స్ఫురించేలా పేరు పెట్టారని మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-6.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-6.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-6.jpg)