Namaste NRI

భళా తందనాన రిలీజ్‌ డేట్‌ ఇదే

శ్రీవిష్ణు, కేథరిన్‌, థ్రెసా జంటగా నటించిన చిత్రం భళా తందనాన. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. మా సినిమా టీజర్‌కి అద్బుతమైన స్పందన వచ్చింది.  వేసవి సెలవులు, మే 3న రంజాన్‌ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించాం. మణిశర్మ సంగీతం అందించిన మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. వాణిజ్యాంశాలతో కూడిన వినోదాత్మక చిత్రమిది. శ్రీవిష్ణు కేథరిన్‌ జోడి ఆకట్టుకుంటుంది. బాణంతో సత్తా చాటిన చైతన్య దంతులూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంటుంది. పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ స్టంట్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. రామచంద్రరాజు, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ రగుతు. బాణం సినిమా ఫేమ్‌ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

…………………………

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events