
సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. దిశాపటానీ కథానాయిక. శివ ఈ చిత్రానికి దర్శకుడు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ఇది. ఇప్పటిదాకా తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పది భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కంగువ త్రీడీ వెర్షన్ కూడా ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. సినిమా అంతకు మించి ఉంటుంది అని తెలిపారు నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్‌రాజా. బాబీ డియోల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ: శివ, ఆదినారాయణ, మాటలు: మదన్ కార్కే, కెమెరా: వెట్రి పళనిస్వామి.
