కమల్ కామరాజు, మోనికా చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ఒసేయ్ అరుంధతి. విక్రాంత్ కుమార్ దర్శకుడు. గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరు గుతున్నాయి. ఈ సినిమాలోని టైటిల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సునీల్‌కశ్యప్ స్వరాలను అందించా రు. దర్శకుడు మాట్లాడుతూ మధ్యతరగతి ఇల్లాలు అరుంధతి కథ ఇది. ఆమె ఓసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకుంటుంది. అప్పుడే అనుకోకుండా ఓ సమస్య వస్తుంది. దాని నుంచి తను ఎలా బయటప డిందన్నదే చిత్ర కథ. కామెడీ ప్రధానంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)