Namaste NRI

ట్రైన్‌లో జరిగే కథ ఇది : భరత్‌ కోమలపాటి

తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  చిత్రం ఎస్‌5, నో ఎగ్జిట్‌. ఈ చిత్రాన్ని శౌరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆదూరి ప్రతార్‌ రెడ్డి, దేవు శ్యామ్యూల్‌, షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్‌ కొండెపూడి నిర్మిస్తున్నారు. భరత్‌ కోమలపాటి (సన్నీ) దర్శకుడు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల సిద్ధమవుతున్నది. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ నటుడు సాయి కుమార్‌ విడుదల చేశారు.  ఈ సందర్భంగా దర్శకుడు భరత్‌ కోమలపాటి మాట్లాడుతూ  ట్రైన్‌లో జరిగే కథ ఇది. ఎస్‌5 పెట్టెలో ఒక దెయ్యం ప్రయాణికులను ఎలా భయపెట్టింది అనేది అసక్తికరంగా ఉంటుంది. సకుటుంబంగా ప్రేక్షకులు చూసేలా రూపొందించాము అన్నారు. నటుడు సాయి కుమార్‌ మాట్లాడుతూ  ఈ  సినిమాలో ఓ మంచి క్యారెక్టర్‌ చేశాను. ఈ చిత్రంలో భరత్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు అన్నారు. ఇది పెద్ద దర్శకులు చేయాల్సిక కథ. ఈ కథను భరత్‌ అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు అని హాస్య నటుడు అలీ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events