
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో, తాతినేని సత్య దర్శకత్వంలో, నాగమోహన్‌బాబు.ఎం, రాజేష్.టి నిర్మిస్తున్న చిత్రానికి సతీ లీలావతి అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘సతీలీలావతిగా డిఫరెంట్‌రోల్‌లో లావణ్య కనిపించనున్నారు. ఉత్సుకతను కలిగించే కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాట లు: ఉదయ్ పొట్టిపాడు, కెమెరా: బినేంద్ర మీనన్, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మా ణం: దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్.
